9th World Telugu Literary Conference Doha Qatar Indian Cinema

9ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, దోహా: Nov 22-23, 2024

సినిమా రచయిత: నాడు, నేడు

రచన: మీర్ అబ్దుల్లా

(పడమటి సంధ్యారాగం)

సినీ నటుడు, దర్శక నిర్మాత

 “ఈ పాశ్చాత్త  సంగీతపు  పెనుతుఫానుకు  రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ  సంగీతజ్యోతిని  ఒక్క కాపు కాయడానికి  తనచేతిని  అడ్డుపెట్టిన  ఆ దాత ఎవరో…. వారికి శిరస్సు వంచి… పాదాభివందనం చేస్తున్నాను!” అన్న డైలాగు లేని “శంకరాభరణం” సినిమాని మీరూహించగలరా? “ఊ….. కిత్నే ఆద్మీ థే?” అన్న డైలాగు లేని “షోలే” సినిమాని  మీరూహించగలరా? అది ఏ భాష … ఏ ప్రాంతం…ఏ దేశపు  సినిమా అయినా,  ఎలాటి సినిమా అయినా… మంచి సినిమా అయినా, పరమ చెత్త సినేమా అయినా...దానికి మొట్టమొదట ప్రాణం పోసేది నిస్సందేహంగా ఒక రచయితే! “లాహిరి లాహిరి… లాహిరి లో….” “జగమే మారినది…మధురముగా ఈవేళ…” “భలే ఛాన్సులే….లలలాం…లలలాం… లక్కీ ఛాన్సులే…ఇల్లరికంలో వున్న మజా!” “పారిజాత సుమదళాల పానుపు… మనకు పరిచినాడు చెరకువింటి వేలుపు!” “ఈ తూరుపు, ఆ పశ్చిమం...సంగమించిన ఈ శుభవేళ ...పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే !” జనరంజకంగా  దశాబ్దాల పాటు....సినీ ప్రేక్షకుల  జ్ఞాపికల్లో  నిలిచిపోయిన ఆ ఆణిముత్యాలు... ఎవరో ఓ రచయిత కలం నుంచి జాలువారిన అక్షరాలే! ఒక దర్శకుడికి కథావస్తువుని ఇచ్చేది… నటీనటులకు డైలాగులను ఇచ్చేది… నిర్మాతలకు లాభాలనీ… సినీ గాయకులకు లిరిక్కులను ఇచ్చేది… ప్రేక్షకుల మనసుల్ని రంజింపసేదీ ...నిస్సందేహంగా…రచయితలు, రచయిత్రులే! గిలిగింతలు పెట్టే సున్నిత హాస్యాన్ని అందించేది… గుండెలని పిండిచేసే సెంటిమెంటల్ డైలాగులని ఇచ్చేది… చక్కని చుక్కలని చూపించి  ఊహాలోకాల్లోనికి  తీసుకెళ్ళేది… సందర్భానుసారం  నవరసాలను  ఓలికించేది…మనలాంటి రచయితలే! అయితే… సినీ పరిశ్రమలో… అంతటి ప్రాముఖ్యతని  పొందవలసిన  రచయితలకు … దక్కవలసిన గౌరవం...అసలు నిజ్జంగా దక్కుతున్నదా? …. అని ఆలోచిస్తే… అంతలా దక్కటం లేదనే చెప్పాలి! ఆనాటి “దేవదాసు” శరత్ బాబు నుంచి… “సెక్రటరీ” యద్దనపూడి సులోచనారాణి, “పడమటి సంధ్యారాగం” జంధ్యాల గారేకాక, నేటి తెలుగు సినిమాల్లోని  వర్ధమాన  రచయితలు… తెలుగు చలన చిత్ర  పరిశ్రమకు ఎలా ప్రాణం పోశారు? పోస్తున్నారు? ప్రజలు, పరిశ్రమ వారిని ఎలా సత్కరించుకుంటున్నాయి? … అని సాంతం పరికించి చూస్తే… అంత గొప్పగా వారిని సత్కరించుకోవటం లేదనే చెప్పాలి. నటీనటులకు అందచేయబడే పారితోషికాలకూ… రచయితలకు ఇవ్వబడుతున్న పారితోషికాలకూ… హస్తిమశ కాంతారం! సినిమాలో హీరో ఎవరో అందరూ చెప్పగలరుకాని… సంభాషలని రాసిన రచయిత ఎవరో ప్రేక్షకుల ఊహకందదు! ఫలానా పాట ఎవరు పాడారు అనడిగితే  టక్కున  చెప్పేస్తాం...కాని ఆ పాటని రాసింది ఎవరు అంటే మనం చెప్పలేం! ఫలానా వర్షం పాటలో మెలికలు తిరిగిన ఆ మెరుపు తీగ ఎవరో బ్రహ్మాండంగా మనకి గుర్తుంటుంది… కానీ… ఆ పాట రాసినది ఎవరో మనకి తెలియదు! ఇదండీ పరిస్థిది!! ఈ పరిస్థితి మారితే బావుంటుంది కదూ? ప్రేక్షకులు,  సినీ దర్శకులు, నిర్మాతలు, పరిశ్రమలో పనిచేసే మిగతా నిపుణులలో... సినిమా రచయత  ప్రాముఖ్యాన్ని సరిగా గుర్తించే  అవగాహన ఉంటే బావుంటుంది కదూ ? అయితే...సినీ చరిత్రలో  అక్కడక్కడా...కొంతమంది రచయితలకు రచయిత్రులకు మంచి గుర్తింపు లభించటం మనం  అప్పుడప్పుడు  గమనిస్తూ ఉంటాం, సంతోషమే! జంధ్యాల, త్రివిక్రమ్  ఇత్యాదులకు రచనా పరంగా పరిశ్రమలో ముందు మంచి గుర్తింపు వచ్చినా...తరువాతి కాలంలో  వారు సినీ దర్శక శాఖ లోకి  చల్లగా జారుకోవటం గమనించవలసిన విషయం!  రచయిత కోణంలో ఆలోచిస్తే ... అది అంతలా సంతోషించవలసిన విషయం కాదు. కదూ? రచయితలకి  న్యాయబద్ధంగా  దొరకవలసిన  గుర్తింపు  రావాలంటే  మనం ఏంచేయాలి? బయటి ప్రపంచం మారే ముందు మనం మారాలి....మనం చేయగలిగింది మనం చేయాలి! మన చేతుల్లో వున్నది మనం చేయాలి!! అంటే, సినిమాల్లో రచయితల కున్న ప్రాముఖ్యతని  ముందుగా  మనం గుర్తించి, సాటి  రచయితలనీ  వారి సత్తానీ  గౌరవించాలి!  మన రచనలని  మనోరంజకంగా  మలచటమేగాక... సమాజిక ప్రయోజనకోసం  కూడా  రాయాలి అన్న కోరిక  మనలో బలంగా ఉండాలి.  అప్పుడే...మన దృక్పధం మారినప్పుడే... బయటి  ప్రపంచం కూడా  మారే అవకాశం ఉంటుంది...అని మనం ఆశించ వచ్చు. ఇప్పుడున్న  పరిస్థితుల్లో, డైలాగుల కంటే  గ్రాఫిక్కులకీ,  సినిమాని  తీసే విధానానికి ప్రాముఖ్యత పెరిగి పోతోంది.  ఆరోగ్యకరమైన  సున్నితమైన హాస్యరసం పోయి తిట్లు, ద్వందార్ధాలు, అశ్లీలత పెరిగిపోతున్నాయి. పాటలోని భావం మీద కన్నా…స్టెప్పుల మీదా, సంగీతం మీదకన్నా  శబ్దాలమీద ధ్యాస ఎక్కువైపోతోంది. దీని వలనకూడా రచయితలకి  ప్రాముఖ్యత  తగ్గిపోతున్నదేమో? సమాజికపరంగా మనకున్న  బాధ్యతలను కూడా మనం గుర్తించి... మంచి రచనలని బయటి ప్రపంచానికి అందచేస్తూ... సాటి రచయితలకి అందవలసిన గుర్తింపుని మనం కూడా దండిగా అందచేస్తూ... మన ప్రాముఖ్యతని మనం కూడా మరికాస్త గుర్తించుకుని.... రచయితలుగా ఎదుగుదాం! ఇది నా చిన్ని అభిప్రాయం!  మరి మీరేమంటారు? నేనూ నా కొంతమంది మిత్రులూ కలసి నిర్మించిన ఆనాటి  "పడమటి సంధ్యారాగం" నిర్మాణంలో నేను చేసినది....ఇప్పుడు నిర్మిస్తున్న "మరో సంధ్యారాగం"  నిర్మాణంలో  నేను చేస్తున్న పని అదే! ఆనాడు...పడమటి సంధ్యారాగం  విషయంలో... హాస్యబ్రహ్మ  శ్రీ జంధ్యాల గారు  మూలకథ ని రాసినా, ఆయన గొప్పదనం ఏమిటంటే... నా పార్టనర్  శ్రీ గుమ్మలూరివారి తోను,  నాతోనూ సంప్రదించటమేగాక ... సినీ నాటక రచయత  ఆదివిష్ణు  గారిని  కూడా  వారు సంప్రదించటం  జరిగింది.  సినిమా టైటిల్స్ లో కూడా మీరు చూస్తారు: "ఆదివిష్ణు సహకారం తో"  అని ఉంటుంది. ఈనాడు...కథకూ, రచయితకూ దండిగా ప్రాముఖ్యత ని ఇచ్చి... "మరో సంధ్యారాగం" మూలకథని  నేను రాసినా, కొంతమంది  సాటి  రచయితలని  కూడా sampradinchatam కథాపరంగా,  సంభాషణల పరంగా వారితో  సంప్రదిస్తున్నాను.  మరో సంధ్యారాగాన్ని  మీ ఆదరాభిమానాకు నోచుకునే విధంగా మలవాలనే కృషిలో  వున్నాను. నాటకాలు రాయటం, వేయటం, వేయించటంలో అనుభవం దండిగానే  వున్నా, హాస్య బ్రహ్మ శ్రీ జంధ్యాల గారి వద్ద  సినిమా  రచన  దర్శకత్వ  శాఖలో  శిష్యరికం చేసిన నేను కూడా అదే చేస్తున్నాను! అందుకే...సాహితీ సదస్సులు  ఆటు అమెరికాలో జరిగిన, కాకినాడ లో జరిగినా....ఇదుగో ఇక్కడ దోహా మహానగరంలో జరుగుతున్నా...సాటి రచయితలని  ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు  మేము తీస్తున్న  "మరో సంధ్యారాగం" లో మీరు కూడా పాల్గొని...దాన్ని మరో పడమటి సంధ్యారాగంలా  తీర్చిదిద్దాలనీ... మా ఈ చిన్ని ప్రయత్నాన్ని  ఆశీర్వదిస్తారని  ఆశిస్తున్నాను! Contact : Meer Abdulla +1-240-381-1984 MeerAbdullaPSR@gmail.com
padamati sandhya ragam

Meer Abdulla, Film Maker, well known for his iconic film ‘Padamati Sandhya Ragam’ (PSR) is planning a sequel titled: “Maro Sandhya Ragam (MSR)” through VeeZari Films banner.

Contact Us

Meer Abdulla, Actor & Film Maker. Get in touch – email:

  • VeeZariFilms@gmail.com
    MeerAbdullaPSR@gmail.com
    MeerAbdulla@veezari-inc.com

© VeeZari Films. All Rights Reserved.

Email

Have a project in your mind?

© 2022 – 2025 | Alrights reserved by Veezarifilms

Email

Have a project in your mind?

09 : 00 AM - 10 : 30 PM

Saturday – Thursday